జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలు గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. గృహ నిర్మాణ సంస్థకు లబ్ధిదారులు వడ్డీతో సహా రుణం చెల్లించినప్పటికీ, ఇంటిపై ఎటువంటి హక్కు పత్రం లభించేది కాదు. ప్రభుత్వం నిర్ధేశించిన డబ్బులు (వన్‌టైం సెటిల్‌మెంట్‌) కింద చెల్లించిన వారికి ఇంటిపై హక్కు కల్పించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణం పొంది ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఒటిఎస్‌ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరింది. ఇంటి రుణం పొందిన లబ్ధిదారుడు, ఆ ఇంటిని అనుభవిస్తున్న వారి వారసులు ఈ పథకం కింద లబ్ధిపొందడానికి వీలు కల్పించింది. ఒటిఎస్‌ కింద అర్హులైన లబ్ధిదారుల జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించనుంది. ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు దరఖాస్తు చేయడం, విచారణ, నగదు చెల్లింపు, రిజస్టర్‌ దస్తావేజు జారీ తదితర సేవలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ (ల్యాండ్స్‌, రెవెన్యూ, రిజస్ట్రేషన్‌), పంచాయతీరాజ్‌, గృహనిర్మాణ శాఖలు నిర్వహిస్తాయని పేర్కొంది. నిర్ధేశించిన మొత్తం చెల్లించిన వారికి రుణమాఫీ వర్తింపజేయడంతో పాటు ఇంటి రిజస్టర్డ్‌ దస్తా వేజులు డిసెంబరు 21న లబ్ధిదారులకు అందజేయనున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.