20 నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి, రూ.31 కోట్ల మేర మోసానికి పాల్పడి… నకిలీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ రాకెట్‌ హైదరాబాద్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. జిఎస్టీ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జెనరల్‌ (విశాఖపట్నం) సదరు మోసగాడిని గురువారం అరెస్ట్‌ చేశారు. వీరి సంస్థలు, ప్రధానంగా గుంటూరు, హైదరాబాద్‌ జిల్లాల్లో ఉన్నాయి. వివిధ స్థాయిలలో ఎంటిటిలను ఉత్పత్తి చేస్తూ, వివిధ రాష్ట్రాలలో ఈ మోసాలతో లావాదేవీలను మభ్యపెట్టడానికి ఈ నకిలీ రాకెట్‌ ఏర్పడినట్లు డిజి వెల్లడించారు. అరెస్టయిన వ్యక్తి నకిలీ పత్రాల సృష్టించి ఈ సంస్థలను నిర్వహించాడు. మొత్తంగా ఈ రాకెట్‌ దాదాపు రూ.265 కోట్ల ఇన్‌వాయిస్‌లు, నకిలీ ఐటీసీని పాస్‌ చేయడంతో నిర్వాహణలో గల కంపెనీలకు రూ.31 కోట్ల మేరకు, నష్టం వాటిల్లింది. మోసపూరితంగా దాదాపు రూ.265 కోట్ల ఇన్‌వాయిస్‌లు ఉపయోగించుకుని పన్నుల చెల్లింపును ఎగవేసినట్లు తెలుస్తోంది. పైన పేర్కొన్న బిల్లు ట్రేడింగ్‌ మాస్టర్‌మైండ్‌ను ఈ రోజు అరెస్టు చేశారు. నిర్వహణలో అతని ప్రమేయం కోసం అధికారులు విచారణ నిర్వహించి అనంతరం అతనిని జ్యుడీషియల్‌ కస్టడీకి రిమాండ్‌ పంపారు. పన్ను ఎగవేతలను గుర్తించేందుకు నిర్వహించిన ప్రత్యక డ్రైవ్‌లో డిజిజీఐ మరియు సిజిఎస్టి ఫీల్డ్‌ ఫార్మేషన్‌ల వారు ఈ మధ్య కాలంలో దాదాపుగా 180 నకిలీ కంపెనీల ను గుర్తించి కేసులను బుక్‌ చేసింది, ఈ డ్రైవ్‌ లో రూ. 160 కోట్లు మోసల్ల్ని గుర్తించారు , 5 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. రూ 60 కోట్లు రికవరీ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.