వార్డుల్లో మట్టి దిబ్బలు, పిచ్చి మొక్కలను తొలగించాలని జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి. లక్ష్మిశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన 4,5 జోన్లలో 31, 61వ వార్డుల పరిధిలోని డాబా గార్డెన్స్‌, ఇన్‌కంటాక్స్‌ ఆఫీస్‌, రమాదేవి పాఠశాల, మల్కాపురం, మార్కెట్‌ వీధి, శెట్టిబలిజ వీధి, ప్రకాష్‌ నగర్‌ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, వార్డులలోని రహదారుల మధ్యలో ఉన్న గోతులను పూడ్చాలని సూచించారు. అనంతరం రెండు వార్డులలో ఉప ఎన్నికల కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్‌ కమిషనర్లు బివి రమణ, మల్లయ్య నాయుడు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ శాస్త్రి, ఎఎంఒహెచ్‌లు డాక్టర్‌ కిషోర్‌, డాక్టర్‌ రాజేష్‌, కార్యనిర్వాహక ఇంజనీరు రత్నాల రాజు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.