రోజులు గడుస్తున్న కొద్దీ తమిళనాడులో వర్షాల బీభత్సం పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలు కుండపోత వర్షాలతో అల్లాడిపోతున్నాయి. అనేక ఊర్లు, పట్టణాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. చెన్నై నగరాన్ని కూడా ఇంకా వరద ముప్పు వీడలేదు. చెన్నై వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని కన్యాకుమారి, వెల్లూరు, రాణిపేట్, తిరుపత్తూరు, ధర్మపురి, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, నామక్కల్, కరూర్, దిండిగల్, సేలం, నీలగిరి, కోయంబత్తూర్, తేని, పెరంబలూర్, తిరుచిరాపల్లి , మధురై, విరుదునగర్, తెంకాసిలో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.

By admin

Leave a Reply

Your email address will not be published.