ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటడంతో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి వారం రోజులపాటు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రభుత్వ అధికారులందరూ వారం రోజుల వర్క్ ఫ్రం హోం పనులు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే విలీనంత వరకు ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించాలని సూచించారు. నవంబర్ 14 నుంచి 17 వరకు భవన నిర్మాణ పనులు అన్నింటిని నిషేధిస్తున్నట్లు తెలిపారు.