తిరుపతి: ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ ఓటమి భయంతో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలు, వలంటీర్ల ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ వలంటీర్లకు ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారు. 24వ వార్డు వలంటీర్‌ గాయత్రి నివాసానికి వెళ్లి వైఎస్సార్‌ సీపీ తరఫున డబ్బులు పంచుతున్నావంటూ ఆమెతో గొడవకు దిగారు. తనకేమీ సంబంధం లేదన్నా వినకుండా టీడీపీ శ్రేణులు గుంపుగా నివాసంలోకి చొరబడి తీవ్రస్థాయిలో హెచ్చరించడమే కాకుండా, మరోసారి తమకు ఏదేని సమాచారం వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందంటూ తీవ్రస్థాయిలో బెదిరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.