తగ్గించిన నీట్ కటాఫ్ స్కోర్ ఆధారంగా ఎండీఎస్ యాజమాన్య కోటా సీట్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. పూర్తి సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలని సూచించింది