వరుణుడు దక్షిణాది రాష్ట్రాలపై పగబట్టినట్టే ఉంది పరిస్థితి. వారం రోజులుగా నీటిలో నానుతున్న తమిళనాడు కోలుకోక ముందే, మళ్లీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలో మరి కొద్ది రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఒక ద్రోణి, ఉత్తర అంతర్గత తమిళనాడు మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి, గంగా పరివాహక ప్రాంత పశ్చిమ బెంగాల్ వరకు ఆంధ్ర, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.