సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం అరచేతిలో చేసేస్తున్నాడు. అంతేకాదు యూట్యూబ్ వాడకం పెరిగిన అనంతరం.. అందులో దొరకని వీడియో అంటూ లేదు. దీంతో కొంతమంది యూట్యూబ్ లోని వీడియోలతో మంచి నేర్చుకుంటూ.. తమ భవిష్యత్ ను అందంగా తీర్చిదిద్దుకుంటుంటే.. మరికొందరు అడ్డదారిలో సంపాదన కోసం చెడ్డపనులను నేర్చుకుంటూ అడ్డంగా పెట్టుబడి… జైలు ఊసలు లెక్కపోతున్నారు. ఓ యువకుడు సంపాదన కోసం యూట్యూబ్ లోని వీడియోలను చూసి ఏకంగా డ్రగ్స్ ను తయారు చేయడం కోసం ల్యాబ్ నే తయారు చేశాడు. నిషేధిత డ్రగ్స్ ను తయారు చేసి అడ్డంగా బుక్ అయ్యి.. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన గుజరాజ్ లోని సూరత్ లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే..

గుజరాత్‌లోని సూరత్‌లోని సార్థనా ప్రాంతంలోని నిషేధిత డ్రగ్ మెత్ తయారీకి ప్రయోగశాలను ఏర్పాటు చేసిన వ్యక్తిని గుజరాత్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని జలోర్‌కు చెందిన ప్రవీణ్ బిష్ణోయ్ అనే వ్యక్తిని రూ. 5.58 లక్షల విలువైన 58 గ్రాముల మెత్‌తో సూరత్ పోలీసులు పట్టుకున్న కొద్ది రోజులకే ఈ అరెస్టు జరిగింది. సార్థనాలోని జైమిన్ సవానీకి నిషేధిత మెత్ డ్రగ్‌ను అందించేందుకు బిష్ణోయ్ నవంబర్ 9న సూరత్‌కు వచ్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని సూరత్ పోలీస్ కమిషనర్ అజయ్ తోమర్ తెలిపారు. సార్థనాలోని రాజ్‌వీర్ కాంప్లెక్స్‌లోని సవానీ కార్యాలయంపై పోలీసుల బృందం దాడి చేశారు. ల్యాబొరేట‌రీలోని గాజు బీకర్‌లు, స్టవ్, గ్లాస్ కనెక్టర్‌లు , లిక్విడ్ మిథనాల్ వంటి కొన్ని ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ త‌యారు చేయ‌డం కోసం ఉప‌యోగించే వ‌స్తువుల‌ను సీజ్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published.