మద్యానికి బానిసైన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మద్యానికి బానిసై ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలా మద్యానికి అలవాటు పడి కుటుంబాలు ఇబ్బందుల్లో పడుతుండటంతో మహిళలు రోడ్డెక్కుతు మద్యాన్ని నిషేధించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని రెండు పంచాయతీలు మద్య నిషేధానికి ఓటు వేశారు. రాజ్‌సమంద్‌ జిల్లాలో బరార్‌, వీర్‌ అనే రెండు పంచాయతీలు శనివారం గ్రామంలో మద్యం దుకాణాలను తొలగించాలని అధిక సంఖ్యలో ఓటు వేశారు. 2015 నుంచి గ్రామ మహిళల ఉద్యమం తర్వాత రాజస్థాన్‌ ఎక్సైజ్‌ చట్టంలోని సంబంధిత సెక్షన్‌ కింద మద్యం షాపుల తొలగింపు కోసం ఓటింగ్‌ జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అయితే ఈ ఓటింగ్‌లో 64 శాతం మహిళలు మద్యం దుకాణాలను మూసివేయాలని ఓటు వేయడంతో మద్య నిషేధం ఖరారైంది.

By admin

Leave a Reply

Your email address will not be published.