కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. దేశ వృద్ధికి ఊతమిచ్చేలా సంస్కరణల ఆధారిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించి పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నవంబర్ 15న జరిగే ఈ వర్చువల్ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కరాద్ కూడా పాల్గొంటారని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.