బిజెపి తిరోగమన విధానాలపై నికరంగా పోరాడే సిపిఎం ఒక్కటే బిజెపికి ప్రత్యామ్నాయం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. సిపిఎం నగర 11వ మహాసభలో నర్సింగరావు మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు చేసే పోరాటం మోడీ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా భావించాలన్నారు. ఆర్థిక పోరాటంతోనే మోడీ విధానాలను ఓడించగమని స్పష్టం చేశారు. డిసిఐ, షిప్‌యార్డు, బిహెచ్‌పివి వంటి పరిశ్రమలను ప్రయివేటీకరణ కాకుండా కింద స్థాయిలో సిఐటియు పోరాటం చేస్తే, సిపిఎం ఎంపీలు పార్లమెంట్‌లో ఒత్తిడి చేసి వాటిని రక్షించారని గుర్తు చేశారు. నేడు స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమం దేశంలో ఒక మోడల్‌గా ఉందన్నారు. యువతపై కేంద్రీకరించాలని, గతంలో ఉక్కు కర్మాగారం సాధన కోసం జరిగిన ఉద్యమంలో యువత కీలకపాత్ర పోషించిందని తెలిపారు. నేడు కొత్త కొత్త రంగాలను గుర్తించి అందులోని యువతను పార్టీలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉద్యమంలో మహిళలు అత్యధికంగా ఉన్నారని, వారిని రాజకీయంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.