పార్టీలోకి ఆహ్వానిస్తున్న విజయసాయిరెడ్డి. 31వ వార్డులో బిజెపి తరుపున కార్పొరేట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న నడుపూరు కళ్యాణ్ కుమార్ వైసిపిలో చేరారు. విజయసాయిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్ది చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుండి ఆదరణ లభిస్తుందని అన్నారు. రానున్న రెండున్నర సంవత్సరాలలో మరింత మంది ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరనున్నారని అన్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు, పదువుల్లో ఉన్నవారు తమతో టచ్ లో ఉన్నారని, సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. జివిఎంసి పరిధిలో 31, 61 వార్డులలో జరుగుతున్న ఉప ఎన్నికలలతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో కుప్పంతో సహా జరుగుతున్న ఉప ఎన్నికలలో వైసిపి విజయ కేతనం ఎగర వేస్తుందన్నారు. దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీ చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్ది అన్ని సామాజిక వర్గాలకు ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ, ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని అన్నారు. అగ్రవర్ణ పేదలకు సైతం ప్రాధాన్యత కల్పిస్తున్నారని, వారి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఇటీవల ప్రకటించిన ఎంఎల్సిలు, అంతకు ముందు వివిధ కార్పొరేషన్లకు సంబందించిన పదువులలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. పార్టీ కోసం క్రమశిక్షణతో కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికీ తగిన ప్రాధాన్యత, గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు.