ఓ వైపు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా జై భీం సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంటుంటే.. మరో వైపు తమిళనాడులో జై భీం సినిమాపై నెలకొన్న వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. జై భీం సినిమాలో పై వన్నియర్ వర్గాల నేతలు విరుచుకుపడుతున్నారు. అంతేకాదు ఓ అడుగు ముందుకు వేసి.. తమ వర్గాన్ని కించపరిచిన నటుడు సూర్య ని కొట్టిన వారికీ ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని పీఎంకే నేతలు ప్రకటించి సంచలనం సృష్టించారు. మరోవైపు సూర్య సినిమాలను ప్రదర్శిస్తున్న థియేటర్స్ దగ్గర వెళ్లి… పీఎంకే నేతల నిరసన వ్యక్తం చేస్తున్నారు. జై భీం సినిమాలో చాలా సన్నివేశాల్లో వన్నియర్ వర్గాన్ని కావాలనే అవమానించారంటూ పీఎంకే నేతల ఆరోపణ చేస్తున్నారు. రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంగం నోటీసు జారీ చేసింది

ఇదే వివాదం ఫై నటుడు సూర్యకి మాజీ కేంద్రమంతి పీఎంకే ముఖ్య నేత అన్బుమణి ఓ లేఖను కూడా రాశారు. ఈ లేఖపై సూర్య స్పందిస్తూ.. తమకు దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే ఉందని.. అంతేకాని తమ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరచడం తమ ఉద్దేశం లేదని.. వివరణ ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published.