మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను మరో రెండు వారాల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. మనీ లాండరింగ్ కేసులో సోమవారం విచారణ చేపట్టిన స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా అనిల్‌ దేశ్‌ముఖ్ తరపు న్యాయవాది ఆయనకు ఆహారం, బెడ్, మందుల కోసం అప్పీల్ చేశారు. తన క్లయింట్ వయస్సు, ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని.. ఆహారం, మందులు, బెడ్ కు అనుమతివ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయనకు బెడ్, జైలు వైద్యుల కన్సల్టేషన్‌తో సంబంధిత మెడిసన్ సమకూర్చాలని పీఎంఎల్ఏ కోర్టు అదేశించింది. ఇంటి నుంచి వండి పంపిన ఆహారాన్ని అనుమతించాలనే విజ్ఞప్తిని కోర్టు పెండింగ్‌లో ఉంచింది.

By admin

Leave a Reply

Your email address will not be published.