సమంత తిరిగి తన కెరీర్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. విడాకుల ప్రకటన అనంతరం సామ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. దీంతో ఆమె పై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరిగింది. అయితే వాటితో తనకేలాంటి సంబంధం లేనట్టుగా తన పని తాను చేసుకుంటూ పోతుంది సమంత. గత కొద్ది రోజులుగా తన పర్సనల్ విషయాలతో పాటు.. కొన్ని మోటీవేటివ్ కోట్స్ నెట్టింట్లో షేర్ చేస్తుంది. ఇక సామ్ ఇప్పుడు సినిమాల పరంగా దూసుకుపోతుంది.. వరుస ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. వివాహం తర్వాత సామ్ సినిమాల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఉమెన్ ఒరియేంటెడ్ మూవీస్ చేస్తూ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ సమంత తన సత్తా చాటుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంది.