నల్లగొండ: మిర్యాలగూడలో బండి సంజయ్ పర్యటన తీవ్ర ఉద్రిక్తత మధ్య సాగింది. పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు విఫల యత్నం చేశారు. బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌ నేతలు బాహాబాహీకి దిగారు. మోదీ డౌన్ డౌన్ అంటూ టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ డౌన్ డౌన్ అంటూ బీజేపీ నేతలు నినాదాలు చేశాయి. ఈ క్రమంలో బండి సంజయ్ వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. కాన్వాయ్‌పై దాడికి నిరసనగా నార్కెట్‌పల్లి అద్దంకి జాతీయ రహదారిపై బైఠాయించిన బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా ఎస్పీ రంగనాధ్ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులను అప్రమత్తం చేశారు

By admin

Leave a Reply

Your email address will not be published.