అమరావతి: బొమ్మిడాయల పులుసు, కొర్రమీను ఫ్రై, రావల ఇగురు, బొచ్చె, శీలావతి, రాగండి కూరలు.. ఈ పేర్లు చెబితేనే మాంసాహారులకు నోరూరుతుంది కదూ.. అవును ఈ చేపల్లో పోషక విలువలూ ఎక్కువే. అందుకే ప్రభుత్వం తాజా స్వచ్ఛమైన చేపలను ప్రజలకు అందించడంతోపాటు, ఆక్వా రైతులకు మార్కెటింగ్, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆక్వా హబ్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ–వెహికల్, మినీఫిష్ రిటైల్ అవుట్లెట్ల స్థాపననూ ప్రోత్సహిస్తోంది