ప్రభుత్వ నిర్మాణాలకు సామర్థ్యం గల గుత్తేదారులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఆసుపత్రి, పాఠశాల, అంగన్వాడీ, రైతు భరోసా కేంద్రాలు మొదలైన భవన నిర్మాణాలకు సంబంధించి ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా కొంత పెట్టుబడి పెట్టి భవనాలు నిర్మించేందుకు కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశ పెట్టారని, వారు చేపట్టే పనులకు తగినట్లు నిర్మాణ సామాగ్రి, మానవ వనరులు, ఆర్థిక స్తోమత ఉండాలని తెలిపారు. ప్రభుత్వం అప్పగించిన పనులను వేగంగా పూర్తి చేయించినపుడే అధికారుల పరిపాలన బయటపడుతుందన్నారు. కొన్ని చోట్ల సిమెంటు, ఇసుక కొరత ఉందని చెప్పడంతో దానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.