టాలీవుడ్ ఇండస్ట్రీకి అందాల రాక్షసిగా పరిచయమై కుర్రకారు మనసు దొచుకుంది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ.. అగ్ర కథనాయికగా దూసుకుపోయింది. భలే భలే మగాడివోయ్.. సోగ్గాడే చిన్ని నాయనా… వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం.. అభినయంతోపాటు.. సొట్ట బుగ్గలతోనూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది లావణ్య. అయితే ముందు నుంచి ఈ అమ్మడు గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో లావణ్య త్రిపాఠికి అవకాశాలు కాస్త తగ్గాయి. ఇక ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. అంతగా సక్సెస్ కాలేదు. అంతేకాకుండా..ఈ సినిమా తను చేసి ఉండకూడదు అనే విమర్శలు వచ్చాయి.