Indian Railways: భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే రైల్వే వ్యవస్థనే. ప్రతినిధ్యం లక్షలాది మంది తమ తమ రైలు ప్రయాణం ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇతర రవాణా వ్యవస్థలకంటే రైళ్లలో తక్కువ ఛార్జీలు ఉంటాయి. అందుకే సామాన్యులు కూడా అధికంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక వసతులు కల్పిస్తుంటుంది. మెరుగైన సేవలు అందించే విధంగా రైల్వే స్టేషన్లలో ఎన్నో వసతులు కల్పిస్తోంది రైల్వే శాఖ. ఇక తాజాగా ముంబై సెంట్రల్లో ప్రయాణికుల కోసం అధునాథన ‘పాడ్ హోటల్’ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ హోటల్ బుధవారం ప్రారంభం కానుంది. భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శ్రీకారం చుట్టింది. స్టేషన్‌లోని మొదటి అంతస్తులో ఈ హోటల్‌ను నిర్మించింది. జపాన్ తరహాలో క్యా్ప్సుల్స్ హోటల్‌గా రూపొందించింది. ఇందులో ప్రయాణికులు రాత్రివేళల్లో బస చేసే విధంగా గదులను ఏర్పాటు చేశారు.