శబరిమల యాత్రకు వెళ్లిన ఓ తమిళనాడు మహిళను భక్తులు అడ్డుకున్నారు. బస్సులో నుంచి కిందకు దించేశారు. అయితే దీనికి కారణం ఏమిటో తెలియడం లేదు. అయితే మహిళ మానసిక స్థితి సరిగా లేకపోవడంతోనే భక్తులు ఆమెను బస్సులో నుంచి కిందకు దించేశారని పోలీసులు చెబుతున్నారు. సదరు మహిళ తమిళనాడులోని తన స్వగ్రామానికి బయలుదేరిందని పోలీసులు పేర్కొన్నారు. కరోనా ఆంక్షలను పాటిస్తూ శబరిమల యాత్రకు ప్రభుత్వం అనుమతినిచ్చిందే. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు శబరిమల యాత్రకు బయలుదేరనున్నారు. నేటి నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.