అమరావతి: ఆమె పేరు బండారు దుర్గ. గుంటూరు జిల్లా మంగళగిరి ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటుంది. కట్టుకున్న భర్త కాదని వదిలి వెళ్లిపోయాడు. పేదరికంతో ఆమెకు కుటుంబ పోషణ భారమైంది. ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ పిల్లల కడుపు నింపాల్సిన పరిస్థితి. ఇక కొడుకులను చదివించడం తలకు మించిన భారమే అయ్యింది.. ఆపై కరోనా దెబ్బకు పరిస్థితి మరింత దిగజారింది. పూట గడవక ఐదో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు అజయ్‌ని చదువు మాన్పించి గొర్రెల కాపరిగా పెట్టింది. ఏడాదికి రూ.30 వేలు తీసుకునే ఒప్పందంతో గొర్రెల యజమానికి అప్పగించింది.