విశాఖపట్నం: విశాఖలోని లాడ్జీలో యువతిపై పెట్రోల్‌తో దాడిచేసి, ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు హర్షవర్ధన్‌ కేజీహెచ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడు. కాగా, ఈ నెల 13న యువతిని మాట్లాడుకుందామని స్థానిక.. శ్రీ రాఘవేంద్ర లాడ్జికి పిలిచాడు. ఈ క్రమంలో.. ఆమెపై హర్షవర్ధన్‌ పెట్రోల్‌తో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో యువతికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాధితులిద్దరిని కేజీహెచ్‌ ఆసుపత్రికి తరలించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.