స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. ఈ మూవీ భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇందులో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తైన మొదటి భాగాన్ని పుష్ప ది రైజ్ అనే టైటిల్‏తో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలో పుష్ప నుంచి వరుస అప్డే్ట్స్ ఇస్తున్నారు మేకర్స్.

By admin

Leave a Reply

Your email address will not be published.