బిగ్‏బాస్ ఇంట్లో కంటెస్టెంట్స్ గొడవలు పడడం.. అరుచుకోవడం.. అలగడం కామన్.. ఎంతగా గొడవలు పెట్టుకున్నా.. తిరిగి మళ్లీ కలుసుకుని అన్యోన్యంగా ఉంటారు. ఇక నామినేషన్స్ రోజున.. టాస్కులలో ఇంటి సభ్యుల ప్రవర్తన చూస్తే చిన్నపాటి యుద్ధమే కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఆగ్రహంతో ఊగిపోతుంటారు. ఇక బిగ్‏బాస్ ఇంట్లో ప్రాణ స్నేహితులుగా మారినవారు లేకపోలేదు. మొదటి రోజు కొందరు ప్రాణస్నేహితులుగా మారిపోతారు ఇక ఈ సీజన్‏లో సన్నీ, మానస్.. సిరి, షణ్ముఖ్ స్నేహితులుగా మారిపోయారు. అయితే షణ్ముఖ్, సిరి.. బిగ్‏బాస్ ఇంట్లోకి రాకముందు నుంచి మంచి స్నేహితులు. వీరిద్దరు ఇప్పటికే పలు షార్ట్ ఫిలింస్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

By admin

Leave a Reply

Your email address will not be published.