Delhi Airport: బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ.. అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. సినీ ఫక్కీలో స్మగ్లర్లు రోజుకో కొత్త దారిలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ అధికారులకు చిక్కుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. లైఫ్ జాకెట్లో పెద్ద ఎత్తున బంగారం తరలిస్తూ పట్టుబడ్డాడు. మంగళవారం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.కోటి ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.