కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణాన్ని ఇప్పటికీ ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేక పోతున్నారు. తమ గుండెల్లో గూడు కట్టుకున్న స్టార్‌కి అంతే స్థాయిలో నివాళులు అర్పిస్తున్నారు. ప్రభుత్వ పరంగా బెంగళూరులో జరిగిన సంతాప సభలో ప్రభుత్వ పెద్దలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంతాప సభకు పలువురు కన్నడ నటీ నటులతో పాటు.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీమా పరిశ్రమల ప్రముఖులు హాజరయ్యారు. అయితే.. ఈ సందర్భంగా ప్రభుత్వ పరంగా ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించారు CM బసవరాజు బొమ్మై. దేశంలోనే పవర్‌ఫుల్‌ అవార్డ్‌ అయిన కర్నాటక రత్న అవార్డును పునీత్‌కు నివాళిగా ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.