అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు జనసేన నేత గుణ్ణం నాగబాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో గుణ్ణం నాగబాబు వైఎస్సార్‌సీపీలో చేరారు. నాగబాబుతో పాటు ఆయన తనయుడు గుణ్ణం సుభాష్, పాలకొల్లు జనసేన నేతలు వీర శ్రీనివాసరావు, విప్పర్తి ప్రభాకరరావులకు సీఎం జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.