విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో నూతన విద్యా విధానం అమలు, తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆరాతీశారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లను నియమించడంతోపాటు, సబ్జెక్టుల వారీగా టీచర్లు, వారితో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్స్, ఫౌండేషనల్ స్కూల్స్, ఫౌండేషనల్ ప్లస్‌స్కూల్స్, ప్రీ హైస్కూల్స్, హైస్కూల్స్, హైస్కూల్ ప్లస్ స్కూల్స్‌పై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందించారు.