► కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం
► మొత్తం 31 వార్డుల్లో.. వైఎస్సార్సీపీ-17, టీడీపీ-14 వార్డుల్లో విజయం సాధించాయి.
04: 20PM
► జగ్గయ్యపేట మున్పిపాలిటీని కైవసం చేసుకునే దిశంగా వైఎస్సార్సీపీ
► రెండో రౌండ్లో 11 వార్డుల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం
► ఇప్పటికే 8 వార్డులను గెలుచుకున్న వైఎస్సార్సీపీ
► కాకినాడలో ఉప ఎన్నిక జరిగిన 4 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది.
► కాకినాడలోని 3, 9, 16, 30వ డివిజన్లలో వైస్సార్సీపీ గెలుపొందింది.
03: 54PM
► రాజంపేట మున్సిపాలిటీ వైఎస్సార్సీపీ కైవసం
► మొత్తం 29 వార్డుల్లో వైఎస్సార్సీపీ-24, టీడీపీ-4, ఇండిపెండెంట్-1 వార్డులో విజయం సాధించాయి.
► గురజాల నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం
► మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ 16, టీడీపీ-3, జనసేన-1 వార్డులో విజయం సాధించాయి.
►ఆకివీడు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కైవసం
► మొత్తం 20 వార్డుల్లో వైఎస్సార్సీపీ-12, టీడీపీ-4, జనసేన-3 వార్డుల్లో విజయం సాధించాయి.
03:32PM
కృష్ణా: కొండపల్లిలో ముగిసిన కౌంటింగ్
► కొండపల్లిలో 29 స్థానాల్లో వైఎస్సార్సీపీ-14 స్థానాల్లో విజయం, టీడీపీ- 14 స్థానాల్లో విజయం, ఇండిపెండెంట్-1 స్థానంలో గెలుపు
03:15PM
► నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్
► నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ ప్లాప్ షో
► బొక్కబోర్లాపడ్డ సైకిల్
► 54కి గాను 54 డివిజిన్లలో వైఎస్సార్సీపీ గెలుపు
►కార్పొరేషన్ ఎన్నిక జరిగిన 46 డివిజన్లలో 46 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం
►ఏకగ్రీవాలతో కలిపి 54 డివిజన్లను కైవసం చేసుకొన్న వైఎస్సార్సీపీ
►క్లీన్ స్వీప్‌తో మరో చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ
02:29PM
విశాఖపట్నం: జీవీఎంసీ 31వ వార్డు కార్పొరేటర్‌గా వైఎస్సార్సీపీ అభ్యర్థి బీపిన్ కుమార్ జైన్ విజయం సాధించారు.
జీవిఎంసీలో 61వ డివిజన్లో వైఎస్సార్సీపీ విజయం
► 2028 ఓట్ల మెజార్టీతో కొణతాల సుధ(వైఎస్సార్సీపీ) గెలుపొందారు.
కృష్ణాజిల్లా:
► కొండపల్లి మున్సిపాలిటీ 19వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగిరాము గెలుపొందారు.
► 26వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి గుంజా శ్రీనివాసు విజయం సాధించారు.
► కొండపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు వైఎస్సార్సీపీ అభ్యర్థి మండే చంద్రశేఖర్ బాబు గెలుపొందారు.
01:40PM
కుప్పం గెలుపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభినందించిన సీఎం వైఎస్ జగన్
01:36PM
మొదటి రౌండ్లోనే కుప్పం మున్సిపల్ ఫలితం
రాష్ట్రంలో అత్యంత ఉత్కంఠగా ఎదురుచూసిన కుప్పం మున్సిపల్ ఎన్నిక ఫలితం మొదటి రౌండ్లోనే తేలిపోయింది. మొదటి రౌండ్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ 15 వార్డులకు గాను 13 వార్డులను కైవసం చేసుకున్నారు. దీంతో 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో మొదటి రౌండ్లోనే వైఎస్సార్సీపీ 13 స్థానాలను గెలుచుకొని మున్సిపాల్టీని తమ ఖాతాలోకి వేసుకున్నారు. టీడీపీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది.
01:00PM
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికే 20 డివిజన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించగా, మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే 8 డివిజన్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.