ఒక రూపాయి నోటు కాకుండా అన్నీ రకాల నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ముద్రిస్తుంది. దేశంలోని ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నోట్లను ముద్రిస్తుంది. ముద్రించే ప్రతి నోటుకు ఒక ప్రత్యేక గుర్తింపు నంబరుతో పాటు అనేక రకాల కొన్ని గుర్తులను కేటాయిస్తుంది. వీటి ద్వారానే ఆ నోటు నిజమైనదా లేదా నకిలీదా అని గుర్తించవచ్చు. ఈక్రమంలో కొంతమంది జనాలు వారి అభిరుచల మేరకు నోట్లను ఖర్చు చేయకుండా పదిలంగా దాచుకుంటుంటారు. మరికొంతమందికి వివిధ రకాల నోట్లను కలెక్ట్‌ చేయడం హాబీగా ఉంటుంది. అయితే వివిధ రకాల నంబర్లు, గుర్తులు కలిగిన నోట్లను అందరూ చూసి ఉంటారు. కానీ స్టార్ సిరీస్‌ నోట్లను మాత్రం చాలా తక్కువ మంది చూసి ఉంటారు. ఎందుకంటే ఇవి అరుదైనవి. ఆర్బీఐ చాలా పరిమిత సంఖ్యలో ఈ స్టార్‌ సిరీస్‌ నోట్లను ముద్రిస్తుంది. మరి ఈ నోట్ల ప్రత్యేకతేంటో ఓసారి తెలుసుకుందాం రండి.

By admin

Leave a Reply

Your email address will not be published.