టీ20 ప్రపంచ కప్ 2021 ముగిసిన తర్వాత భారత్‌, న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ రోజు మొదటి టీ 20 మ్యాచ్‌ జరిగింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ విధించిన 165 పరుగుల టార్గెట్‌‌ను సునాయసనంగా చేధించింది. ముఖ్యంగా సూర్యకుమార్‌యాదవ్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. మరోవైపు ఒపెనర్‌గా బరిలోకి దిగిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 36 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కివీస్‌ బౌలర్లలో బోల్ట్‌ రెండు వికెట్లు సాధించాడు. మిగతా వారు ఎవ్వరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

By admin

Leave a Reply

Your email address will not be published.