జగ్గయ్యపేట: కట్టుకున్న భార్య ప్రవర్తన నచ్చక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని మిట్టగూడెంనకు చెందిన ఆళ్ల వెంకటేశ్వరరావు (25) బైక్‌ మెకానిక్‌గా జీవిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం రాచేపల్లికి చెందిన కృష్ణవేణితో అతనికి వివాహమైంది. కొన్నేళ్ల పాటు సజావుగానే ఉన్నా ఇటీవల ఆమె మరొక వ్యక్తికి విహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి అక్కడే భర్తపై కేసు పెట్టింది. అయితే పెద్దలు రాజీచేసి ఆమెను కాపురానికి పంపించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.