తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జైభీమ్. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ అందుకుంది. సమాజంలో అణగారిన వర్గాలపై పోలీసుల దాష్టీకాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ లాంటి ప్రముఖులు సూర్యను అభినందిస్తూ ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. మరోవైపు వివాదాలు కూడా ఈ సినిమాను వెంటాడుతున్నాయి. అయితే ఎన్ని వివాదాలు నడుస్తున్నా సినిమాపై ప్రముఖుల ప్రశంసలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ట్విట్టర్‌ వేదికగా సూర్యను అభినందించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.