ఓవైపు TRS మహాధర్నా చేస్తుండగానే.. తెలంగాణలో బియ్యం కొనుగోలుపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని స్పష్టం చేసింది..ఈ సీజన్లో 60 లక్షల టన్నుల ధాన్యం సేకరించేందుకు ఇప్పటికే అంగీకారం తెలిపామని చెప్పింది. గతంలో 44.7 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేస్తామని చెప్పినట్లు వెల్లడించింది. ఇకపై బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని అప్పుడే చెప్పినట్లు గుర్తుచేసింది. అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించిందంటూ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో పారా బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ లేదు. ఈ తరహా రైస్ వినియోగించే రాష్ట్రాలు స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇకపై బాయిల్డ్ రైస్ సేకరణ కుదరదని ఇప్పటికే తెలంగాణకు చెప్పామని.. అందుకు ప్రభుత్వం కూడా అంగీకరించిందని స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ మహాధర్నా చేపట్టిన కొద్ది గంటల్లోనే కేంద్రం రిప్లయ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.