చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కల్యాణి జలాశయం పూర్తి నీటిమట్టానికి చేరుకుంది. పాలసముద్రంలో వెంగళరాజకుప్పం చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.