శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను అవమానించేలా మాట్లాడుతున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. పద్మశ్రీ పురస్కారాల విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందని.. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. పైరవీలకు తావు లేకుండా పురస్కారాలకు అర్హుల్ని గుర్తించేందుకు కమిటీ వేశారని గుర్తుచేశారు.

అందువల్లే రాష్ట్రం నుంచి వనజీవి రామయ్య, ఆసు యంత్రం సృష్టికర్త చింతకింది మల్లేశం వంటి వారికి పురస్కారాలు లభించాయన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కేంద్రం విస్మరించిందనడం శుద్ధ అబద్ధమన్నారు. విదేశాంగమంత్రి జైశంకర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 19 సభ్యదేశాలను ఒప్పించి రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడం కేంద్రం ఘనత కాదా? అని ప్రశ్నించారు.

By admin

Leave a Reply

Your email address will not be published.