రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న దాదాపు 10లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్ల అందించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. పీఅండ్‌జీ, హైజీన్ అండ్ హెల్త్‌కేర్, నైన్ కంపెనీకి చెందిన బ్రాండెడ్ శానిటరీ న్యాప్కిన్లను ప్రతి విద్యార్థినికి నెలకు 10 చొప్పున ఏడాదికి 120 ఇస్తామని తెలిపారు. వేసవి సెలవులకు సరిపడా సెలవులకంటే ముందే ఒకేసారి పాఠశాలల్లోనే పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఇందుకుగాను ఏడాదికి రూ.32 కోట్లు వ్యయమవుతుందన్నారు. గ్రామస్థాయిలోని మహిళలకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకే చేయూత దుకాణాల్లోనూ విక్రయిస్తామని చెప్పారు.