తెలంగాణ పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. పోలీసింగ్‌లో టాప్‌లో నిలిచింది. దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్మార్ట్‌ పోలీసింగ్‌ విధానాల అమలుపై ప్రతిష్టాత్మక ఇండియన్‌ పోలీసు ఫౌండేషన్‌ (ఐపీఎఫ్‌) సంస్థ సమగ్ర సర్వే నిర్వహించింది. మొత్తం 11 అంశాలపై చేసిన ఈ సర్వేలో తెలంగాణకు ఐదింటిలో మొదటి స్థానం, మరో ఐదింటిలో రెండో స్థానం లభించింది.

కేవలం ఒక్క దాంట్లో మూడో స్థానం వచి్చంది. ఈ నివేదికను ఫౌండేషన్‌ చైర్మన్‌గా ఉన్న ఉత్తరప్రదేశ్‌ మాజీ డీజీపీ ప్రకాష్‌ సింగ్‌ గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. అస్సాం, బీఎస్‌ఎఫ్‌లకూ డీజీగా పని చేసిన ఈయన గతంలో పోలీసు సంస్కరణలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి నేతృత్వం వహించారు. ఈ సర్వేలో మొత్తం 1,61,192 నమూనాలు సేకరించి విశ్లేంచారు. అవసరమైన స్థాయిలో, సంతృప్తికరంగా నమూనాలు రాని నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను దీని ఫలితాల్లో చేర్చలేదు.

By admin

Leave a Reply

Your email address will not be published.