మావోయిస్టు పార్టీ పెదబయలు దళానికి చెందిన ఇద్దరు మహిళా మావోయిస్టులు గురువారం జిల్లా ఎస్‌పి బి.కృష్ణారావు ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్‌పి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. చింతపల్లి మండలం కోటగున్నాలు గ్రామానికి చెందిన తాంబేలు సీత అలియాస్‌ నిర్మల (25) తల్లిదండ్రులు చిన్న తనంలోనే మరణించడంతో ఆర్థిక, స్థానిక పరిస్థితుల రీత్య 2018లో మావోయిస్టు దళంలో చేరింది. తక్కవ కాలంలోనే పార్టీలో కీలక సభ్యురాలిగా ఎదిగింది. ఆమె 2 హత్యలు, 2 మందుపాతరలు, 2 కిడ్నాప్‌, 3 ఇతర నేరాల్లో ముఖ్య నిందితురాలు. చింతపల్లి మండలం తాటిడవులు గ్రామానికి చెందిన పాంగి లచ్చి అలియాస శైలు (20) మావోయిస్టు పార్టీ సభ్యలు సుదీర్‌, శ్వేత, స్వర్ణ తరుచు తమ గ్రామాల్లో నిర్వహించే సభలకు ఆకర్షితురాలై 2017లో దళంలో చేరింది. ఆమె 2 హత్యలు, 4 ఫైరింగ్‌ నేరాల్లో నిదితురాలు. ఇద్దరూ ఆరోగ్య కారణాలు, పార్టీలో ఉన్న విభేదాల రీత్య సాధారణ జనజీవన గడపాలని కోరుకుంటున్నారని, వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నామని ఎస్‌పి తెలిపారు. వీరిద్దరిపై చెరో లక్ష రూపాయలు రివార్డు ఉందని, అది వారికే వచ్చేలా చర్యలు తీసుకుంటామని, వారు సాధారణ జీవనం గడపటానికి నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో సిఆర్‌పిఎఫ్‌ కమాండెంట్‌లు కవింద్రకుమార్‌, సంజరు కుమార్‌ త్రివేది పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published.