అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజు సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. చంద్రబాబు, టీడీపీ నేతల హైడ్రామాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎలా పోయినా చంద్రబాబుకు పట్టదు.. తన రాజకీయ అజెండానే ఆయనకు ముఖ్యం అని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘ప్రతీ అంశాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసు. నేను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. చంద్రబాబు సంబంధంలేని విషయాలు తీసుకువచ్చి.. రెచ్చగొట్టారు. కానీ విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. దేవుడి ఆశీస్సులు.. ప్రజల దీవెనలు ఉన్నంత కాలం మమ్మల్ని ఎవ్వరు కూడా అడ్డుకోలేరు’’ అని తెలిపారు.