► వ్యవసాయ రంగంపై సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వర్షం వలన ఇబ్బందులపై చర్చలు జరుగుతున్నప్పుడు.. ప్రతి పక్షాలు కేవలం రాజకీయ కోణంలోనే ప్రవర్తించాయని సీఎం జగన్‌ విమర్శించారు. ప్రతి పక్షం అంటే.. సలహలు, సూచనలు ఇ‍వ్వాలని సీఎం జగన్‌ హితవు పలికారు. మనం ప్రజలకు మంచి చేస్తే.. మనకు జరుగుతుందని అన్నారు.

Time : 01: 10 PM

► వ్యవసాయ రంగంపై ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ.. సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారన్నారు. చంద్రబాబు కేవలం సింపతి కోసమే సభ నుంచి వెళ్లిపోయారని అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు.

Time: 01:05 PM

► వ్యవసాయ రంగంపై మంత్రి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగునీటి కాల్వలను పూడికతీసి పునరుద్ధరించామని తెలిపారు. చివరి ఆయకట్టు భూమివరకు సాగునీరు అందేల చర్యలు తీసుకున్నామని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.

Time: 12: 55 PM

► వ్యవసాయ రంగంపై మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం.. రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. కుప్పంలో ఓటమితో చంద్రబాబు.. మైండ్‌బ్లాక్‌ అయ్యిందని అన్నారు. టీడీపీ సభ్యులు.. ప్రీ ప్లాన్‌ ప్రకారం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కురసాల కన్నబాబు మండిపడ్డారు.

Time: 12: 50 PM

► అసెంబ్లీ నుంచి చంద్రబాబు కావాలని వెళ్లిపోయారని కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు కేవలం సింపతి కోసం.. రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలు.. చంద్రబాబు.. మంగమ్మ శపథాలు పట్టించుకునే స్థితిలో లేరని అన్నారు.

► చంద్రబాబు కావాలనే ప్లాన్‌ ప్రకారమే సభ నుంచి వెళ్లిపోయారని కొడాలి నాని తెలిపారు. చంద్రబాబు.. అందితే కాలు.. అందకపోతే జుట్టు పట్టుకుంటారని కొడాలని నాని మండిపడ్డారు.

By admin

Leave a Reply

Your email address will not be published.