అమరావతి: చంద్రబాబు విధి ఎవరినీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుందని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు డ్రామాపై ఆర్కే రోజా మాట్లాడుతూ.. 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ను ఎంత ఏడ్పించావో గుర్తుందా బాబు?. 71 ఏళ్ల 7 నెలలకే నీకు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది మనకు తిరిగొస్తుందని. మీ కుటుంబ సభ్యుల్ని అన్నారని తెగ బాధపడిపోతున్నావే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ అసెంబ్లీలో నామీద పీతల సుజాతతో సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా?. అంటే మాకు కుటుంబాలు కానీ, మర్యాదలు కానీ లేవనుకున్నావా?. అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎవర్ని ఏదైనా అంటావు.

By admin

Leave a Reply

Your email address will not be published.