హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో సినీ నటి ఛౌరాసియాపై అటాక్ చేసిన నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. వారం రోజుల ఇన్వెస్టిగేషన్ తర్వాత నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. సినీ నటి ఛౌరాసియాపై దాడి చేసింది లైట్‌మెన్ కొమ్ము బాబుగా పోలీసులు తెలిపారు. కృష్ణానగర్‌లో నివాసముండే బాబు… సినీ ఫీల్డ్‌లో లైట్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కేబీఆర్ పార్క్‌లో ఛౌరాసియాపై అటాక్ చేసిన బాబు … ఆమె ఫోన్ లాక్కుని పారిపోయాడు. అయితే, పార్క్‌లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితుడ్ని గుర్తించడం కష్టంగా మారింది. అటాక్ తర్వాత పారిపోతూ ఒకచోట సీసీ కెమెరాకు చిక్కడంతో చివరికి నిందితుడ్ని పట్టుకున్నారు పోలీసులు.