విజయవాడ: దివంగత ఎన్టీఆర్ను మోసం చేసినట్లే చంద్రబాబు ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా మోసం చేస్తున్నాడని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి ధ్వజమెత్తారు. చంద్రబాబు యథావిధిగా కుటుంబానికి అబద్ధం చెప్పాడని నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ఏమీ జరగకున్నా, మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని మండిపడ్డారు. కన్నీళ్లు పెట్టుకొని పెద్ద సీన్ క్రియేట్ చేశారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు.