కడప-తిరుపతి: వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు, ఆ తర్వాత వరదలకు గురైన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు. జిల్లాలో వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేశారు.