హైదరాబాద్‌: హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో యాంటిజెన్‌ పరీక్ష ఖరీదైన వ్యవహారంగా మారింది. ప్రయాణానికి 72 గంటల ముందే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేసుకున్నప్పటికీ విమానాశ్రయంలో ఫ్లైట్‌ బయలుదేరడానికి ముందు యాంటిజెన్‌ పరీక్ష తప్పనిసరిగా మారింది. దీంతో కనీసం రూ.150 కూడా విలువ చేయని యాంటిజెన్‌ పరీక్షలకు అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.4500 వరకు వసూలు చేస్తున్నారు. కోవిడ్‌ నెగెటివ్‌ నినేదికతో బయలుదేరిన ప్రయాణికులు సైతం యాంటిజెన్‌ పరీక్ష చేసుకోవలసి రావడంతో చిన్న టెస్టు కోసం రూ.వేలల్లో వసూలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published.