హైదరాబాద్: వానకాలం..చలికాలం…ఇలా సీజన్‌తో సంబంధం లేకుండా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏటా గ్రేటర్ సిటీ నిండా మునుగుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ 19 వరకు సరాసరిన 21.8 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో సాధారణం కంటే 50 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. అల్పపీడనం, వాయుగుండం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం, ఇలా పలు కారణాలతో ప్రతి నెలా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.