హైదరాబాద్: కొద్దిసేపటి క్రితం మంత్రి వర్గసహచరులతో భేటీ అయిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరికాసేపట్లో సీఎం కేసీఆర్ స్వయంగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. రంగారెడ్డి జిల్లా రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ సిట్టింగ్‌లకే అవకాశం కల్పించనున్నారు. ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులను మార్చి, కొత్తవారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఒక్కో సిట్టింగ్ స్థానం అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.